న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ గడువు వచ్చే సోమవారం(మే 3వ తేదీ) ఉదయం 5 గంటలకు ముగియనుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 25 వేలకు మించకుండా నమోదు అవుతుండటంతో లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది.
నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 27 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 375 మంది మరణించారు. వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Lockdown in Delhi is being extended by one week
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 1, 2021