న్యూఢిల్లీ: ఢిల్లీలోని కర్కర్దూమ దిగువ కోర్టులో న్యాయాధికారిగా పనిచేస్తున్న అమన్ కుమార్ శర్మ(30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి బంధువు కథనం ప్రకారం.. భార్య వేధింపులకు తట్టుకోలేక ఆమె చున్నీతోనే ఆయన ఉరేసుకొని చనిపోయారు. మృతుడి భార్య స్వాతి కూడా న్యాయాధికారే. అమన్ మృతికి ముందు రెండు రోజుల పాటు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
చనిపోవడానికి ఒక రోజు ముందు అమన్ తన తండ్రికి ఫోన్ చేసి తాను తీవ్రంగా కలత చెందానని..బతకడం కష్టమైపోయిందని ఆవేదన చెందారు. ఆ తర్వాత శనివారం మళ్లీ స్వాతి భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత కాసేపటికే అమన్ కుమార్ బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకొని చనిపోయి కనిపించారు.