Havan | ఆసుపత్రిలో హోమం.. ఫొటో వైరల్, రోగుల భద్రతపై ఆందోళన
Havan | ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి (Havan) సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఒక ఆసుపత్రిలో హోమం (Havan) నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఆసుపత్రిలోని రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ద్వారకాలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ భవనంలో ఇటీవల హోమం నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రోగి ఆరోగ్యం కోసం ఇది నిర్వహించినట్లు ఒక జర్నలిస్ట్ తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ఉన్న మణిపాల్ హెల్త్ హాస్పిటల్ ప్రవేశం వద్ద ఈ హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘దేవుడా మమ్మల్ని రక్షించు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కాగా, ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఈ పొగ ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమన్నారు. అయితే 2021లో డెల్టా స్ట్రెయిన్ వల్ల దేశంలో కరోనా కేసులు పెరిగిన సందర్భంలో కూడా ఇదే ఆసుపత్రిలో హోమం నిర్వహించిన సంగతిని ఒక ట్విట్టర్ యూజర్ గుర్తు చేశారు. దానికి సంబంధించిన పాత ఫొటోను షేర్ చేశారు.
మరోవైపు తమ ఆసుపత్రిలో హోమం నిర్వహించిన సంఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పింది. తమ బృందం తగిన చర్యలు చేపడుతుందంటూ ఆ జర్నలిస్ట్‌కు బదులిచ్చింది.
that means they have disabled the automatic fire fighting system or else the havan's smoke would have triggered the desired response.
— rushi114 (@rushi1141) March 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

