కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు నేడు
మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ విధించటాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ విధించటాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు. అరెస్టు చేసిన సమయాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు విరుద్ధంగా తన అరెస్టు ఉందని కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌ను ప్రశ్నించిన ఈడీ
మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బీభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌లను ఈడీ సోమవారం ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వారిద్దరి నుంచి వాంగ్మూలం నమోదుచేసినట్టు ఈడీ తెలిపింది.
ఆప్ మంత్రులపై ఢిల్లీ ఎల్జీ ఆగ్రహం
ఢిల్లీ మంత్రులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన పట్ల శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖల రోజువారీ కార్యకలాపాలపై చర్చించేందుకు తాను ఆహ్వానించినప్పటికీ వీరు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సాకుగా చూపించి, ఈ మంత్రులు తాను నిర్వహించాలనుకున్న సమావేశాలకు హాజరుకావడం లేదని తెలిపారు. ఈ మేరకు ఎల్జీ సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖను రాసింది.
కేజ్రీవాల్ బీజేపీలో చేరితే ఒక్కరోజులో బయటకొస్తారు: ఆతిశీ
కేజ్రీవాల్ గనుక బీజేపీలో చేరితే, ఆయన ఒక్కరోజులో జైలు నుంచి విడుదల అవుతారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ అన్నారు. అస్సాంలో దిబ్రూగఢ్‌లో సోమవారం ఆప్ అభ్యర్థి తరపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచబోరని, దేశంలోని సాధారణ ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగిస్తారని ఆతిశీ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మాదిరిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బీజేపీలో చేరితే.. కేజ్రీవాల్ కేవలం ఒక్క రోజులో బయటకు వస్తారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

