Arvind Kejriwal | కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. సీబీఐకి హైకోర్టు నోటీసులు
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఊరట దక్కలేదు.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో సీఎం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు సీబీఐకి నోటీసులు (CBI) జారీ చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.
Excise Police Case | Delhi HC issues notice to the CBI on a plea moved by Delhi’s Chief Minister Arvind Kejriwal seeking bail in a CBI case connected to the Excise Policy matter. Next date is July 17.
Delhi CM Arvind Kejriwal was arrested by the Central Bureau of Investigation…
— ANI (@ANI) July 5, 2024
మద్యం పాలసీ కేసులో మార్చిలో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మధ్యంతర స్టేను సవాల్ చేయగా.. హైకోర్టు తోసిపుచ్చింది. ఇక జూన్ 29న కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు మద్యం కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 12 వరకూ పొడిగించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో బుధవారం హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.
Also Read..
Rishi Sunak | నన్ను క్షమించండి.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
Kuala Lumpur airport | ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

