Lieutenant Governor Saxena: జైలు నుంచి సర్కార్ను నడపడం కుదరదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
Lieutenant Governor V K Saxena: కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కరెక్టు కాదన్నారు. జైలు నుంచి సర్కారును నడపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే జైలు నుంచే ఆయన ప్రభుత్వ ఆదేశాలను జారీ చేస్తున్నారు. దీన్ని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Lieutenant Governor V K Saxena) తప్పుపట్టారు. జైలు నుంచి ఢిల్లీ సర్కార్ను నడపలేరని ఆయన అన్నారు. జైలు నుంచి ప్రభుత్వ పాలనను కేజ్రీవాల్ కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ నేతలు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21 తేదీన అరెస్టు చేశారు. మార్చి 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర గవర్నర్ సక్సేనా.. జైలు నుంచి సర్కారును నడపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

