న్యూఢిల్లీ : ఢిల్లీలోని రోహిణి, సెక్టర్ 17లో ఉన్న ఝుగ్గి క్లస్టర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. 800 గుడిసెలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి, మంటలను ఆర్పేశారు. రోహిణి డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ మాట్లాడుతూ, రెండున్నరేళ్లు, మూడేళ్లు వయసుగల చిన్నారుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.