Arvind Kejriwal | ఢిల్లీ లిక్క పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌పై స్పందన కోర్టు విచారణను జూన్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మధ్యంతర బెయిల్ గడువు జూన్ ఒకటితో ముగియనున్నది. ఆయనను కోర్టు జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
అయితే, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన రెగ్యులర్ బెయిల్‌తో పాటు ఏడువారాల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారణకు స్వీకరించారు. అయితే, మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరగా.. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆకస్మికంగా బరువు తగ్గడంతో పాటు కీటోన్ స్థాయిలు అధికంగా ఉన్నందున పీఈటీ-సీటీ స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను కోరారు.