న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం అతిశి వీడియో వివాదం దేశరాజధానిలో అలజడి సృష్టిస్తున్నది. అసెంబ్లీలో మాట్లాడుతూ ఓ సందర్భంలో సిక్కు గురువులను ఎమ్మెల్యే అతిశి అమానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఆ ఘటనకు చెందిన వీడియో(Atishi Video)ను బీజేపీ రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో ట్యాంపర్ చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ఆరోపించింది. కానీ ఆ వీడియో ట్యాంపరింగ్ కాలేదని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఇవాళ స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రకారం ఆ వీడియో ట్యాంపరింగ్ జరగలేదన్నారు.
ఎమ్మెల్యే అతిశి మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసినట్లు పంజాబ్‌లోని ఆమ్ ప్రభుత్వం ఆరోపించింది. అసెంబ్లీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఢిల్లీ మంత్రి కపిల్ శర్మపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గుప్తా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆప్ డిమాండ్ చేసినట్లుగానే జనవరి 8వ తేదీన వీడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. అయితే వీడియో క్లిప్‌లో మాజీ సీఎం అతిశి చేసిన వ్యాఖ్యలు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఉన్నట్లు స్సీకర్ గుప్తా తెలిపారు.
జనవరి 6వ తేదీన సిక్కు గురువులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గురు తేజ్ బహబూర్ 350వ స్మారకోత్సవం సందర్భంగా చర్చ చేపట్టారు. అయితే ఢిల్లీ కాలుష్యం, వీధి కుక్కల అంశంపై చర్చ చేపట్టాలని మాజీ సీఎం అతిశి పట్టుపట్టారు. ఆ క్రమంలో కుక్కలను కూడా గౌరవించాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. అతిశి సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు.
అసెంబ్లీలో మాట్లాడిన వీడియో లీక్ కావడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆచూకీ లేకుండాపోయారు. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కానీ వీడియో వివాదం మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నది.
बीजेपी सिख समाज और गुरुओं से नफ़रत करती है, और आज भी इन्होंने गुरुओं का अपमान करते हुए एक घिनौनी हरकत की है।
बीजेपी ने गुरु तेग़ बहादुर जी के नाम को ग़लत तरीक़े से इस्तेमाल किया और गुरु साहब का अपमान किया। उन्होंने एक वीडियो ट्वीट किया जिसमे गुरु साहब के बारे में दो झूठ कहे है:… pic.twitter.com/uTCqOosomf
— Atishi (@AtishiAAP) January 7, 2026