పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్‌పై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదని చెప్పారు. గురువారం పాట్నాలో మీడియాతో లాలూ మాట్లాడారు. ‘ఢిల్లీ ఎన్నికల ఫలితం బీహార్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. వారు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? మనం ఇక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయగలదా? ప్రజలు ఇప్పుడు బీజేపీ అంటే ఏమిటో గుర్తించారు’ అని అన్నారు.
కాగా, లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా బీహార్ ఎన్నికలపై ఢిల్లీ ప్రభావాన్ని ఇటీవల తోసిపుచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులు (జనతా మాలిక్ హై). దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని, ఉత్తుత్తి హామీలు ఉండవని ఆశిస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Patna, Bihar: RJD Supremo Lalu Prasad Yadav says, “It won’t make any difference, BJP will be defeated. How will BJP form a government while we are here? People have understood BJP, they know you well…” pic.twitter.com/9s9V46hf5L
— IANS (@ians_india) February 13, 2025