రియా అరెస్టే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య!

న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమైన సమస్యలన్నింటిని వదిలి కేంద్రప్రభుత్వం, ఓ వర్గం మీడియా సుశాంత్ రాజ్పుత్ మరణం కేసులో బాలీవుడ్ నటి రేహా చక్రబర్తి, ఆమె కుటుంబ సభ్యుల విచారణ చుట్టే తిరుగుతున్నాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కేసును వాడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జూన్ 14న సుశాంత్ సింగ్ చనిపోయినప్పటి నుంచి మీడియాలో అదే ప్రధాన అంశంగా నిలుస్తుందని, ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం-మీడియా 24 గంటలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఈ కేసులో రియా, ఆమె మొత్తం కుటుంబాన్ని దోషులుగా తేల్చడమే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అనేలా కేంద్రప్రభుత్వం, అదిచెప్పినట్లు వినే మీడియా వ్యవహరిస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ ప్రధాన వాగ్ధానాల్లో కొన్నింటిని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని విడిచిపెట్టింది, దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లు దాటేసింది, కోట్లలో ఉద్యోగాలు వచ్చేశాయి, రైతులు, వ్యాపారులు అత్యధిక లాభాలను ఆర్జించారు, స్వచ్ భారత్, డిజిటల్ స్కిల్ ఇండియా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక దేశంలో మిగిలింది కేవల రియా చక్రబర్తి, ఆమె కుటుంబం అరెస్టు మాత్రమే అని వ్యంగ్రాస్తాలు విసిరారు.
సుశాంత్ సింగ్ మృతి కేసులో తన కొడుకు అరెస్టు సందర్భంగా కంగ్రాట్స్ ఇండియా అని మాజీ ఆర్మీ డాక్టర్ రియా చక్రబర్తి తండ్రి భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఈమేరకు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
- నగర పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
- కోవిడ్ వ్యాక్సిన్ : ఆధార్ కీలకం