Robert Vadra | రాబర్ట్ వాద్రాకు బెయిల్.. మనీలాండరింగ్ కేసులో ఉపశమనం..!
Robert Vadra | హర్యానా (Haryana) లోని గురుగ్రామ్ (Gurgao) భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Robert Vadra : హర్యానా (Haryana) లోని గురుగ్రామ్ (Gurgao) భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో వాద్రాకు పెద్ద ఉపశమనం లభించినట్లయ్యింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన వాద్రాకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాబర్ట్ వాద్రాకు చెందిన ‘స్కై లైట్ హాస్పిటాలిటీ’ సంస్థ.. 2008లో హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుంచి 3.53 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో వాద్రా తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండా (నగదుగా మారని చెక్కు ద్వారా) లావాదేవీలు జరిపారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి, ఆ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి, ఆ తర్వాత దానిని ‘డీఎల్ఎఫ్’ సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొన్నది.
ఈ మొత్తం వ్యవహారం ద్వారా పీఎంఎల్ఏ (PMLA) చట్టం ప్రకారం రూ.58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంచేసింది. ఈ కేసు చార్జిషీట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వాద్రా శనివారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని, తనను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం చెప్పినట్లు ఈడీ నడుచుకుంటోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

