న్యూఢిల్లీ, ఆగస్టు 16 : ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంతో.. కోర్టు కార్యకలాపాలు అరగంటపాటు నిలిచిపోయాయి. ఆగస్టు 11న చోటుచేసుకున్న ఈ ఘటనలో అడిషనల్ సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాలా, మరుసటి రోజు కోర్టు తలుపులు తెరిచే వరకు అతడికి జైలు నిర్బంధాన్ని, రూ.2 వేల జరిమానాను విధించారు.
ఆ వ్యక్తి ఏదో చేతబడి చేశాడంటూ న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయవిచారణ పట్ల అగౌరవంగా వ్యవహరించిన నిందితుడు డాక్టర్ చందర్ విభాస్పై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి నోటీస్లు పంపారు. తన చర్యలపై నిందితుడు కోర్టుకు క్షమాపణలు తెలిపాడు.