Judicial Custody | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇద్దరు నేతలను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి కస్టడీని పొడిగించారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, సీబీఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలు ఉన్నారు.