Arvind Kejriwal | ప్రజాస్వామ్యం గెలిచింది.. సుప్రీం తీర్పుపై కేజ్రీవాల్ హర్షం
Arvind Kejriwal | ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు (Suprme Court) కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నట్లు సుప్రీం తన తీర్పుతో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఆప్ (AAP) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) హర్షం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు (Suprme Court) కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా ఢిల్లీ సర్కార్, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నట్లు సుప్రీం తన తీర్పుతో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఆప్ (AAP) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా ఈ సమస్యలతో పోరాడుతోందని అన్నారు. తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మా ప్రభుత్వం గత ఏనిమిదేళ్లుగా ఈ సమస్యతో పోరాడుతోంది. సుప్రీం తన తీర్పుతో ప్రజలకు న్యాయం చేసింది. ప్రజాస్వామ్యం గెలిచింది. ఢిల్లీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ తీర్పుతో ఇప్పుడు ఢిల్లీ అభివృద్ధి వేగం పెరగనుంది. నాకు మద్దతిచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా ప్రభుత్వం ఢిల్లీలో కొత్త గవర్నెన్స్ మోడల్ను ప్రవేశపెడుతుంది. కొందరు అధికారుల వల్ల నగరంలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు బాధ్యతాయుతమైన అధికారులకు విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను అరవింద్ కేజ్రీవాల్ కలిసే అవకాశం ఉంది.
Also Read..
Suprme Court: ఎల్జీది కాదు.. కేజ్రీదే పవర్: సుప్రీంకోర్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

