Donald Trump | నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఆ మహిళ ఎవరో నాకు తెలీదు : జ్యూరీ తీర్పుపై ట్రంప్ వ్యాఖ్యలు
Donald Trump | లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ జ్యూరీ (NewYork jury) ఇచ్చిన తీర్పుపై అమెరికా మాజీ అధ్యక్షుడు (Former US president ) డొలాన్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) తనపై చేసిన లైంగిక ఆరోపణలు (Sexually assaulted ) అన్నీ కట్టుకథలే అన్నారు.
Donald Trump | లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ జ్యూరీ (NewYork jury) ఇచ్చిన తీర్పుపై అమెరికా మాజీ అధ్యక్షుడు (Former US president ) డొలాన్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) తనపై చేసిన లైంగిక ఆరోపణలు (Sexually assaulted ) అన్నీ కట్టుకథలే అన్నారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తనకు ఏ పాపం తెలియదని చెప్పారు.
కోర్టు తీర్పు తర్వాత ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ మహిళ ఎవరో నాకు తెలియదు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదు. ఆమె ఎవరో కూడా నాకు ఐడియా లేదు. నేను నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ మహిళ ఎవరో నిజంగా నాకు తెలియదు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఓ కట్టు కథ’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు లైంగిక ఆరోపణల కేసులో తీర్పు జారీ చేసిన ఫెడరల్ జడ్జిపైనా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ‘క్లింటన్ నియమించిన భయంకరమైన జడ్జి’ అని పేర్కొన్నారు.
తనను ట్రంప్ లైంగికంగా వేధించాడని ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 1990లో మాన్‌హట్టన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. కారోల్ ఆరోపణలపై విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ (NewYork jury).. ట్రంప్‌ను దోషిగా పేర్కొంది.
‘కారోల్ లైంగికదాడికి గురైనట్టు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది నిజం. ఆమె పరువు తీయడానికి ట్రంప్ ప్రయత్నించారు’ అని జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ మేరకు ట్రంప్‌నకు రూ.41 కోట్ల జరిమానా విధిస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది.
Also Read..
Sanna Marin | మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఫిన్లాండ్ ప్రధాని
Shaakuntalam | ఒక రోజు ముందే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

