Sanna Marin | మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఫిన్లాండ్ ప్రధాని
Sanna Marin | ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధాన మంత్రి (Finland PM ) సనా మారిన్ (Sanna Marin) తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు.
Sanna Marin | ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధాన మంత్రి (Finland PM ) సనా మారిన్ (Sanna Marin) తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. భర్త మార్కస్ రైకోనెన్ (Markus Raikkonen) నుంచి విడిపోనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తాము విడాకులకు ( Divorce) దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు.
‘మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఇకపై మంచి స్నేహితులుగానే ఉంటాం. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’ అని సనా మారిన్ (Sanna Marin) చెప్పుకొచ్చారు.
వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయిన మార్కస్ రైకోనెస్‌తో సనా మారిన్ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. 2019లో సనా (Sanna Marin) ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత.. 2020లో ఆగస్టులో వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాజాగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
Also Read..
IPL 2023: క్వాలిఫై అవ్వాలంటే.. ఈ మ్యాచ్ గెలవాల్సిందే.!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

