Swachh bharat | పారిశుద్ధ్యంలోనూ మనమే ఫస్ట్.. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో నంబర్ వన్‌గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది.
- ఓడీఎఫ్ ప్లస్‌లో 100% గ్రామాలు.. కేంద్ర జల్‌శక్తి శాఖ తాజా నివేదిక
Swachh bharat | న్యూఢిల్లీ, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. తెలంగాణలోని అన్ని గ్రామాలు (100 శాతం) బహిరంగ మల విసర్జనరహిత (ఓడీఎఫ్ ప్లస్) గ్రామాలుగా మారాయి. దేశంలోని కొన్ని రాష్ర్టాలు మాత్రం ఇప్పుడే ఓడీఎఫ్ ప్లస్‌లో 50 శాతానికి చేరాయి. బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసిన నివేదికలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
భారత్‌ను బహిరంగ మల విసర్జనరహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) దేశంగా మార్చేందుకు స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకం ఫేజ్-1ను 2014లో భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఫేజ్-2లో భాగంగా ఇప్పటికే 50 శాతం వరకు గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారాయి. ఓడీఎఫ్ ప్లస్ గ్రామం అంటే.. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల అమలుతోపాటు అందరికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి బహిరంగ
మలవిసర్జనరహిత గ్రామం గా ఉండటం. దాదాపు 3 లక్షల గ్రామాలు తమను తాము బహిరంగ మల విసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఇతర రాష్ర్టాలకు మాడల్‌గా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించి ఇతర రాష్ర్టాలకు మాడల్‌గా నిలిచింది. తెలంగాణ తర్వాత స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ర్టాలు ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్, నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, డామన్డయ్యూ, లక్షద్వీప్‌లు కూడా ఓడీఎఫ్ ఫ్లస్ 100 శాతం సాధించాయి. సమిష్టి కృషితో లక్ష్యసాధనకు సహకరిస్తున్న గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ర్టాలు, యూటీలు అందిస్తున్న సహకారాన్ని డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ విభాగం, జల శక్తి మంత్రిత్వశాఖ అభినందిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

