Shaakuntalam | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ (OTT) లోకి వచ్చేసింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో కానీ అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు.
Also Read..
Sanna Marin | మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఫిన్లాండ్ ప్రధాని
Stress Relieve: ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ ఆహార పదార్థాలు తినండి