Stress Relieve: ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ ఆహార పదార్థాలు తినండి
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఒత్తిడి గురవుతాడు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సరైన పౌష్టికాహారాన్నితీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
Stress Relieve: ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఒత్తిడి గురవుతాడు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సరైన పౌష్టికాహారాన్నితీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలసుకుందాం..
కార్బోహైడ్రేట్స్: ఒత్తిడితో బాధపడేవారు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరటోనిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యేందుకు ఉపయోగపడుతాయి. సెరటోనిన్ శరీరంలో ఒత్తిడిని తగ్గించేందుకు పని చేస్తుంది. అందువల్ల ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఆహారం తీసుకోవడం మంచిది.
విటమిన్ – సి: మన శరీరంలో విటమిన్ – సి ఒత్తిడి సంబంధిత హార్మోన్లను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడికి గురయ్యేవారు వారి దినచర్యలో విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా విటమిన్ సి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.
విటమిన్ బి: ఆకుకూరల్లో, పచ్చి బఠానీల్లో అధికంగా ఉండే విటమిన్ బి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ అందదు. కాబట్టి స్ట్రెస్తో బాధపడుతున్నవారు వారంలో కనీసం మూడుసార్లు అయినా ఆకుకూరలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల వల్ల శరీరానికి విటమిన్ బితో పాటు మెగ్నీషియం కూడా అందుతుంది. క్యారట్ లాంటి ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
వీటితో పాటు ఒమేగా ౩ ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆవకాడ, చేపలు, నట్స్ కూడా ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటిని దినచర్యలో భాగం చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

