Priyanka Chopra | పెళ్లికి ముందు నిక్ చాలా మందితో డేటింగ్ చేశాడు.. భర్త ఎఫైర్స్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్
Priyanka Chopra | లైఫ్‌లాంగ్ ఒక బంధంలో అడుగుపెట్టేందుకు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలిపింది. నిక్ తనకంటే ముందు చాలా మందిని ప్రేమించాడని ప్రియాంక తెలిపింది. చాలా మందితో డేటింగ్ చేసినట్లు చెప్పింది.
Priyanka Chopra | లైఫ్‌లాంగ్ ఒక బంధంలో అడుగుపెట్టేందుకు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలిపింది. అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జొనాస్ (Nick Jonas)తో పెళ్లికి ముందు తన ఎఫైర్స్ గురించి ప్రియాంక తాజా ఇంటర్వ్యూలో నోరు విప్పిన విషయం తెలిసిందే. ఇదే ఇంటర్వ్యూలో తన భర్తతో పరిచయం, డేటింగ్, పెళ్లికి ముందు నిక్కు ఉన్న ఎఫైర్స్‌పై కూడా మాట్లాడింది. నిక్‌తో ఫస్ట్ టైమ్ డేట్‌కు వెళ్లడం కోసం.. ఓ రాత్రంతా కూర్చొని అతడి గురించి గూగుల్‌లో బాగా సెర్చ్ చేసినట్లు చెప్పింది. తన వీడియోలన్నీ చూసి అంతా ఓకే అనుకున్నాకే అతడితో డేట్‌కు వెళ్లానని తెలిపింది.
‘నేను లైఫ్ లాంగ్ ఒక బంధంలో అడుగుపెట్టేందుకు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. చాలా మందితో డేట్ చేశా. కొన్ని బంధాలు విషాదంగా ముగిశాయి. పెళ్లికి ముందు నిక్‌తో కూడా కొన్నాళ్లు డేటింగ్ చేశాను. అయితే, నిక్ జొనాస్‌కు ప్రియుడిగా కాకుండా భర్తగా ప్రమోషన్ ఇచ్చా’ అని చెప్పుకొచ్చింది.
నిక్ కూడా తనకంటే ముందు చాలా మందిని ప్రేమించాడని ప్రియాంక తెలిపింది. చాలా మందితో డేటింగ్ చేసినట్లు చెప్పింది. కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నట్లు తెలిపింది. ‘నిక్ నా కంటే ముందు చాలా మందిని ప్రేమించాడు. చాలా మందితో డేటింగ్ చేశాడు. అదంతా గతం. అయిపోయిన దాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. ప్రస్తుతం మా రిలేషన్ బాగుంది. చాలా సంతోషంగా ఉన్నాం. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా’ అని ప్రియాంక తెలిపింది. కాగా నిక్ జోనాస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్ తదితర స్టార్స్‌తో ప్రేమాయణం నడిపాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.
Also Read..
Shaakuntalam | ఒక రోజు ముందే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం
Priyanka Chopra | చాలా మందితో డేటింగ్ చేశా.. వారంతా ఎంతో గొప్ప వ్యక్తులు : ప్రియాంక చోప్రా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

