Suprme Court: ఎల్జీది కాదు.. కేజ్రీదే పవర్: సుప్రీంకోర్టు
Suprme Court: ఢిల్లీ ఎల్జీకి షాకిచ్చింది సుప్రీం. ఎన్నికైన కేజ్రీ సర్కార్కే .. ఐఏఎస్‌లపై నియంత్రణ ఉంటుందని పేర్కొన్నది. ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ మినహా.. సర్వ అధికారాలు ఢిల్లీ సర్కార్ చేతుల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు(Suprme Court) కీలక తీర్పును వెలువరించింది. చాన్నాళ్లుగా ఢిల్లీ సర్కార్, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. ఈ కేసులో 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పుతో ఏకీభవించడం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న విషయాన్ని తాము అంగీకరించబోమన్నది.
ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ మధ్య జరిగిన వివాదంపై జస్టిస్ అశోక్ భూషణ్ 2019లో తీర్పును వెలువరించారు. అయితే ఆ తీర్పును తాము అంగీకరించడం లేదని ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సుప్రీం తెలిపింది.
ఇక అన్ని రాష్ట్రాల తరహాలోనే ఢిల్లీలో పాలన ఉంటుందని సుప్రీం తెలిపింది. ల్యాండ్, పోలీస్, లాపై అధికారం కేంద్రానికి ఉంటుందని కోర్టు చెప్పింది. మిగిలి అన్ని అంశాలపై శాసనాధికారం కేజ్రీ సర్కార్‌కు ఉంటుందని కోర్టు చెప్పింది. సీజేఐ చంద్రచూడ్ తీర్పును చదివి వినిపించారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారలను కేంద్ర సర్కార్ టేకోవర్ చేసుకోరాదు అని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణమురారీ, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలు ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమే ఆఫీసర్లపై నియంత్రణ కలిగి ఉండాలని, ఒకవేళ అలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఆఫీసర్లపై నియంత్రణ లేకుంటే, అప్పుడు ఆ సర్కార్ బాధ్యత సన్నగిల్లుతుందని కోర్టు చెప్పింది. ప్రభుత్వానికి ఆఫీసర్లు స్పందించకుంటే, అప్పుడు సమిష్ట బాధ్యత నీరుగారే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

