న్యూఢిల్లీ, జనవరి 7: తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం తనకు నోటీసు ఇచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మంగళవారం వెల్లడించారు. మూడు నెలల్లో రెండవసారి తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్రం రద్దు చేసిందని ఆతిశీ తెలిపారు.
తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి అయిన రోజున బీజేపీ తన వస్తువులను రోడ్డుపై విసిరేసిందని ఆమె చెప్పారు. తన చర్యలతో బీజేపీ తమ ఆశయాన్ని అడ్డుకోలేదన్నారు. అవసరమైతే తాను ఢిల్లీ ప్రజల ఇళ్లలో తలదాచుకుని వారి కోసం పనిచేస్తానన్నారు. కాగా, అధికారిక నివాసాన్ని లాక్కున్నారంటూ ఆతిశీ చేసిన ఆరోపణను బీజేపీ ఖండించింది.