సోమవారం ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ, కేజ్రీవాల్ వాడిన కుర్చీని కాకుండా మరో కుర్చీ వేసుకొని విధులు నిర్వర్తించారు. రామాయణంలో భరతుడిలా నాలుగు నెలలపాటు ఢిల్లీకి సీఎంగా ఉంటానని ఆమె అన్నారు.
అయితే ఆతిశీ వేరే కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని, సీఎం స్థాయిని అవమానపర్చారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.