న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న అధికార భవనం పునరుద్ధరణకు రూ.44.78 కోట్లు ఖర్చు పెట్టారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా సమర్పించాలంటూ సీఎస్ నరేశ్కుమార్ను ఎల్జీ వీకే సక్సేనా ఆదేశించారు. ‘సీఎం ప్రస్తుతం నివసిస్తున్న సివిల్లైన్స్లోని అధికార బంగ్లా పునరుద్ధరణ పనుల్లో అనేక అక్రమాలు జరిగాయి’ అంటూ ఇటీవల ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి.