Arvind Kejriwal | ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని (Connaught Place) ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని (Hanuman temple) ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం కేజ్రీవాల్ నేరుగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ 1 గంటకు ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్‌షోల్లో పాల్గొంటారు. ఈ రోడ్‌షోల్లో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో మే 25న ఆరో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi CM Arvind Kejriwal offers prayers at Hanuman Mandir in Connaught Place.
His wife Sunita Kejriwal and Punjab CM Bhagwant Mann are also with him. pic.twitter.com/Xci2LNwx3d
— ANI (@ANI) May 11, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal comes out of Hanuman Mandir in Connaught Place after offering prayers here.
His wife Sunita Kejriwal and Punjab CM Bhagwant Mann are also with him. pic.twitter.com/1oj9jJVGFT
— ANI (@ANI) May 11, 2024
Also Read..
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్
Delhi Storm | ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలకు అంతరాయం