పటియాలా: వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంజాబ్లో ప్రచార హడావిడి ఊపందుకున్నది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆప్, శిరోమణి అకాలీదళ్, బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రచార వ్యూహరచనల్లో తలమునకలై ఉన్నారు. అన్ని పార్టీలకంటే ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకంటే కూడా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతున్నది.
ఈ క్రమంలో ఇవాళ పంజాబ్లోని పటియాలా పట్టణంలో ఆమ్ఆద్మీ పార్టీ శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వం వహించారు. శాంతి మార్చ్ పేరుతో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ఆప్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు. కాగా, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఆప్ ముందున్నది. మొత్తం 117 స్థానాల అసెంబ్లీకి ఇప్పటికే 5 జాబితాల్లో 88 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
#WATCH | Delhi Chief Minister and AAP Convenor Arvind Kejriwal leads party's 'Shanti March' in Patiala, Punjab pic.twitter.com/DRfRkeQ9qT
— ANI (@ANI) December 31, 2021