Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్‌కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేసిన సమయంలో రెండు ఫైళ్లకు ఆమోదముద్ర వేసేందుకు తనకు రూ.300కోట్ల ముడుపులు ఆశచూపారంటూ ఆరోపణలు చేసిన మాజీ గవర్నర్‌ను విచారిస్తున్నారు. ఆర్కేపురం ప్రాంతంలోని సోమ్ విహార్‌లోని ఆయన నివాసానికి ఉదయం 11.45 సమయంలో అధికారులు వచ్చారు.
ఆరోపణలపై వివరణ కోరేందుకే సీబీఐ ఆయనను ప్రశ్నించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మాలిక నిందితుడు, అనుమానితుడు కాదని పేర్కొన్నారు. గత ఏడు నెలల కాలంలో సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించడం ఇది రెండోసారి. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పదవి నుంచి తప్పుకున్న తర్వాత గతేడాది అక్టోబర్‌లో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. తాజాగా మరోసారి వివరణ కోరుతూ సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజాలు మాట్లాడి కొందరు వ్యక్తుల పాపాలను బయటపెట్టానని, అందుకే సీబీఐ అధికారులు తనను కలుసుకోవచ్చన్నారు.
తాను రైతు కొడుకునని, భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజంపైనే నిలబడతానంటూ ట్వీట్ చేశారు. జమ్మ కశ్మీర్‌లోని పభ్త్వు ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సురెన్స్ స్కీమ్‌తో పాటు రూ.2200కోట్ల కిరూ హెడ్రై ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పనులకు సంబంధించి ముడుపులు ఇవ్వజూపినట్లు సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి విచారణ జరుపుతున్నది.