న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయు కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం మాట్లాడుతూ.. 15 ఏండ్లు దాటిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని ఆదేశించినట్లు తెలిపారు.
వాహనాల వయసును గుర్తించేందుకు పెట్రోల్ బంకుల వద్ద పరికరాలను అమర్చుతామన్నారు. ఈ అదేశాలను అమలు చేసే ప్రారంభంలో భారీ వాహనాలపై దృష్టి పెడతామని చెప్పారు. ఈ నెల 31 నుంచి ఈ ఆదేశాలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.