న్యూఢిల్లీ: చేతిలో సెల్‌ఫోన్..! ఆడియో అయినా, వీడియో అయినా క్షణాల్లో రికార్డు చేసే అవకాశం..! చాలామంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. కొందరు నేరగాళ్లు మాత్రం దీన్ని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్‌లకు తెగబడుతున్నారు. తాజాగా ఉత్తర ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒక మహిళతో ఏకాంతంగా, నగ్నంగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వీడియో రికార్డు చేశారు.
తర్వాత ఆ వీడియోను అడ్డంపెట్టుకుని బాధితుడిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టారు. తమకు అడిగినంత మీన ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. దాంతో భయపడిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న జ్యోతినగర్ పోలీసులు.. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వీడియో తీస్తున్న సమయంలో బాధిత వ్యక్తి గమనించి ఎదురుతిరగడంతో నిందితులు తాము పోలీసులమని చెప్పారని, పైగా నిందితుడిపై దాడికి కూడా పాల్పడ్డారని జ్యోతినగర్ పోలీసులు తెలిపారు.