న్యూఢిల్లీ, జనవరి 16: ఫ్రెంచ్ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్ నుంచి 114 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అత్యున్నత నిర్ణాయక విభాగమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ స్థాయిలో ఆమోదం పొందవలసి ఉంటుంది.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పనిచేసే భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలియచేయాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మధ్య ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో భారత్, ఫ్రాన్స్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది.