సోమవారం 06 జూలై 2020
National - Jun 29, 2020 , 14:18:06

భద్రతా అనుమతుల కోసం కేంద్ర రక్షణశాఖ కొత్త పోర్టల్‌

భద్రతా అనుమతుల కోసం కేంద్ర రక్షణశాఖ కొత్త పోర్టల్‌

న్యూఢిల్లీ: వివిధ భద్రతా అనుమతుల కోసం ఒక కొత్త పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ కొత్త పోర్టల్‌ను ప్రారంభించారు. ఇకపై రక్షణ సంస్థల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన భద్రతాపరమైన అనుమతుల కోసం సంబంధిత సంస్థలు ఈ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ కొత్త పోర్టల్‌, సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో తమ ప్రతిపాదనలను సమర్పించడానికి వీలు కల్పిస్తుదని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆయా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి వీలుగా రూపొందించిన ఈ ఆన్‌లైన్ వ్యవస్థ అత్యంత సమర్థవంతమైనదేగాక, వేగవంతం, పారదర్శకతతో కూడుకున్నదని పేర్కొన్నారు. రక్షణ సంస్థల పరిధితోపాటు భారత ప్రాంతీయ సముద్ర జలాలు, ఈఈజ్‌ ప్రాంతాల్లో చేపట్టే కార్యకలాపాలకు అవసరమయ్యే భద్రతాపరమైన అనుమతుల కోసం ఈ పోర్టల్‌ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. 
logo