న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం జరిగిన స్మోక్ అటాక్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ప్రకటన చేశారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆ స్మోక్ అటాక్ ఘటనను ఖండించినట్లు చెప్పారు. ఈ అంశంపై స్పీకర్ తన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో ప్రవేశం గురించి ఎవరికి పాసులు ఇవ్వాలన్న అంశంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో పొగ క్యాన్లతో దాడి చేసిన నిందితులపై యూఏపీఏ కింద కేసు బుక్ చేశారు. ఓ గ్రూపునకు చెందిన ఆరుగురు ఈ అటాక్‌లో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.
#WATCH | Defence Minister Rajnath Singh speaks in Lok Sabha on yesterday’s security breach incident pic.twitter.com/TfKBAHV4kk
— ANI (@ANI) December 14, 2023