బెంగళూరు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఇండియన్ ఓషన్ షిప్ సాగర్‌ను ప్రారంభించారు. వ్యూహాత్మక ప్రాంతమైన కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో దీనిని ఆవిష్కరించారు. ఇక్కడ కొత్తగా అభివృద్ధిపరచిన మౌలిక సదుపాయాలను కూడా ఆయన ప్రారంభించారు.
రక్షణ మంత్రి కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకా రం, హిందూ మహాసముద్ర ప్రాం తం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఐఓఎస్ సాగర్ కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని ప్రాంతాల భద్ర త కోసం పరస్పర, సంపూర్ణ అభివృద్ధి అనే భారత దేశ దార్శనికతకు అనుగుణంగా నౌకను నిర్మించినట్టు అధికారులు చెప్పారు.