న్యూఢిల్లీ : పార్లమెంట్లో తన అముద్రిత ఆత్మకథ దుమారం రేపిన కొన్ని వారాల తర్వాత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఈ వివాదంపై స్పందించారు. చైనాతో సరిహద్దు వివాదం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తనతో అన్నట్లు చెబుతున్న జో ఉచిత్ సంఝో వో కరో(మీకు ఏది సముచితమనిపిస్తే అది చేయండి) అనే వ్యాఖ్య వెనుక ఉన్న అర్థాన్ని ఆయన వివరించారు.
ఈ వివాదం తర్వాత ఇండియా టుడేకు ఇచ్చిన తన ప్రత్యేక ఇంటర్వ్యూలో జనరల్ నరవణే మాట్లాడుతూ ఆ వ్యాఖ్య సాయుధ దళాలపై ప్రభుత్వానికి ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని చూపిస్తుందని అన్నారు.