న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను గురువారం ఉదయం ఎయిమ్స్‌లోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో చేర్పించారు. ఎయిమ్స్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రీమా దాదా తెలిపిన వివరాల ప్రకారం, రాజ్‌నాథ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. నడుము నొప్పి రావడంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు.
కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పబోతున్నది. ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత తీర్పును సుప్రీంకోర్టు మే 17న రిజర్వు చేసింది.