న్యూఢిల్లీ, జూలై 23: కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో నిధులు స్వల్పంగా పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.94 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరుగ్గా.. తాజా 2024-25 బడ్జెట్లో కొంత పెంచి రూ.6,21,940 కోట్లు కేటాయించారు.
మూలధన వ్యయాన్ని 1.72 లక్షల కోట్లుగా ప్రకటించారు. ఒక్క రక్షణ రంగానికి కేటాయించిన నిధులు.. మొత్తం బడ్జెట్లో 12.9 శాతం కావడం గమనార్హం. తాజా కేటాయింపులు రక్షణ రంగంలో స్వావలంబనకు మరిం త బలం చేకూరుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
1.72 లక్షల కోట్ల మూలధన వ్యయం సాయుధ బలగాల సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి సంబంధించి బీఆర్వోకు నిధులు కేటాయింపుపై రాజ్నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.6.21 లక్షల కోట్లనే కేటాయించారు.