న్యూఢిల్లీ, జూలై 13: నౌకా దళానికి అవసరమైన 26 రాఫెల్ – ఎమ్ జెట్లను, మూడు స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాఫెల్ జెట్లలో నాలుగు శిక్షణ విమానాలున్నాయని వెల్లడించింది. మూడేండ్లలోపు వీటిని అందించేలా ఒప్పందం ఉంటుందని, ధరలపై సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పింది.