అహ్మదాబాద్ : జంతువులు మనుషుల సాయంతో ఇబ్బందికర పరిస్ధితుల నుంచి బయటపడిన వీడియోలు ఇంటర్నెట్లో కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. గుజరాత్లో ఇదే తరహా ఘటనలో ఓ జింక ఏటీఎంలో చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమ్రేలి ప్రాంతంలోని ధారిలో ఈ ఘటన చోటుచేసుకోగా స్ధానికులు వీడియో రికార్డు చేశారు. కుక్కల గుంపు వెంటపడటంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో జింక ఏటీఎంలో చిక్కుకుపోయింది. ఏటీఎం నుంచి బయటపడే దారిలేక ఆందోళనతో జింక గంతులేస్తుండగా స్ధానికుల కంటపడింది. వారు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. సహాయ సిబ్బంది ఏటీఎం వద్దకు చేరుకుని జింకను బయటకు తీసుకువచ్చారు.