Pariksha Pe Charcha | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ ఎడిషన్ పరీక్షా పే (Pariksha Pe Charcha 2025) చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సారి చాలా స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిరోజు విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
చదువుకునే రోజుల్లో చాలా ఒత్తిడి ఉంటుందని దీపిక చెప్పారు. ఎన్నో భయాలు కూడా ఉంటాయని వివరించారు. ఆ భయాలన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సమస్యలను లోలోపల అణచిపెట్టుకోకూడదని.. వాటిని బయటకు చెప్పాలని సూచించారు. సమస్యలను తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు. విద్యార్థులు జర్నల్ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రొమో వీడియోను దీపిక ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. పూర్తి ఎపిసోడ్ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది.
కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రంలో దీపికతోపాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru), బాలీవుడ్ సెలబ్రిటీలు విక్రాంత్ మస్సే, భూమి పడ్నేకర్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్, పారా అథ్లెట్ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌధరీ, ఫుడ్ ఫార్మర్ రేవంత్ హిమత్సింగ్కా వంటి ప్రముఖులు పాల్గొని బోర్డు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు చిట్కాలు అందజేస్తారు. తమ అనుభవాలను కూడా విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు.
Also Read..
Hydrogen Train | భారత్ తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది..! ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..!