Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు (Vinesh Phogat) కోట్లాది భారతీయుల నుంచి భరోసా లభిస్తోంది. వినేశ్ ఓడిపోలేదని, ఆమె కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా అన్నారు. క్రీడా వ్యవస్ధే ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. గోల్డ్ మెడల్ సాధించిన వారికి అందించే సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం ఆమెకు సమకూర్చాలని దీపీందర్ హుడా డిమాండ్ చేశారు.
ఇవాళ హరియాణ నుంచి ఓ రాజ్యసభ స్ధానం ఖాళీ అయిందని, తమకు మెజారిటీ లేదని, అయితే ఎంపీ పదవికి ఎవరికైనా అర్హత ఉందంటే అది వినేశ్ మాత్రమేనని అన్నారు. ఆమె దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన తీరు ప్రపంచంతో పాటు దేశానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు ఆవిరయ్యాయి.
అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది. మరోవైపు దేశం యావత్తూ వినేశ్ వెంట నిలిచి సంఘీభావం ప్రకటించింది. ఇక ఈ అనుభవంతో వినేశ్ ఫొగాట్ మరింత దృఢంగా మారుతుందని బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ అన్నారు.
సిల్వర్ మెడల్ సాధించిన వారికి అందించే సదుపాయాలన్నీ వినేశ్‌కు కల్పిస్తామని హరియాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ సౌకర్యాలన్నింటినీ ఆమెకు సమకూరుస్తారని చెప్పారు. వినేశ్ తమ బిడ్డని, ఆమె చాలా సంకల్పబలం కలిగిన మహిళని కొనియాడారు. ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్ కాబోరని, భవిష్యత్‌లో తమ బిడ్డ మరింత గట్టిగా పోరాట పటిమ ప్రదర్శిస్తుందని నవీన్ జిందాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.
Read More :
NGT: కాజిరంగా పార్క్ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం.. సుమోటో కేసు దాఖలు చేసిన ఎన్జీటీ