Sabarimala | న్యూఢిల్లీ : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొట్టమొదటిసారిగా శబరిమల యాత్రికుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. అమర్నాథ్, చార్ధామ్లలో మాదిరి ‘శబరిమల’ యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ఐఎండీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సన్నిధానం, పంబా, నీళక్కల్.. మూడు చోట్ల వర్ష సూచికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.
దీంతో శబరిమలకు సంబంధించి మూడు రోజుల వాతావరణ సమాచారం భక్తులకు అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర మరింత సులభతరం అవుతుందని ఐఎండీ పేర్కొన్నది. శాశ్వత వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలిసింది.