న్యూఢిల్లీ, ఆగస్టు 31: త్వరలో లోక్‌సభతో పాటు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ తర్వాత ఇంధన ధరల తగ్గింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నదని సిటీ గ్రూపు ఐఎన్‌సీ అభిప్రాయపడింది.
ఎన్నికల ముందర పెట్రోల్, డీజిల్ ధరలపై సర్కార్ దృష్టి పెడుతుందని పేర్కొన్నది. తాజాగా గృహ వినియోగ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 2014లో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇంధన ధరలను ఆకాశమే హద్దుగా భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.