జైపూర్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. మరో నెలన్నర రోజుల్లో రాజస్థాన్లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జైపూర్లో సోమవారం ఈ మేరకు మీడియాతో అన్నారు. ‘రాజస్థాన్లో పార్టీని ప్రారంభిస్తున్నాం. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం’ అని చెప్పారు.
కాగా, తెలంగాణలో మొదలైన ఏఐఎంఐఎం ప్రస్తానం, పలు రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్ర, బీహార్లో పలు సీట్లు గెలిచి ఖాతా చేరిన ఆ పార్టీ తాజాగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తమినాడు, కర్ణాటకలో పార్టీ విస్తరణపై దృష్టిసారించింది.
राजस्थान में @asadowaisi की एंट्री
— Manish Bhattacharya (INDIA TV)﮷ (@Manish_IndiaTV) November 15, 2021
2023 में विधान सभा चुनाव लड़ेगी ओवैसी की पार्टी @aimim_national pic.twitter.com/7OD8hPXXq3