న్యూఢిల్లీ, నవంబర్ 13: అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది. ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు పూర్తి కాలేదని వివరించింది. కేసు విచారణ 2వారాలు వాయిదా పడింది.