న్యూఢిల్లీ : విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం (యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.
గత దశాబ్దంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిలో దాదాపు 300 మందిని ఇంటర్వ్యూ చేసి, ఈ నివేదికను రూపొందించారు. ప్రజల జీవితాల్లోని అన్ని అంశాలను కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ప్రభుత్వం కఠినంగా నియంత్రిస్తున్నదని తెలిపారు.