న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి ఊతమిస్తూ, వారికి నిత్యం అండగా ఉండే పాకిస్థాన్ బహిరంగంగానే వారిపై తన ప్రేమను చాటుకుంది. తీవ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి ఇప్పటివరకు విధిస్తున్న మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు పాక్ సెనేట్ దానికి ఆమోదముద్ర వేసింది.
హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళలను బహిరంగంగా వివస్త్రను చేయడం వంటి నేరాల్లో దోషులకు ఇప్పటివరకు విధిస్తున్న మరణ శిక్షను తగ్గిస్తూ క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025ను తీసుకుని వచ్చారు. ఇక నుంచి అలాంటి నేరాలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తెచ్చారు.