గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 09:35:08

క‌న్యాకుమారి తీరంలో డాల్ఫిన్ క‌ళేబ‌రం

క‌న్యాకుమారి తీరంలో డాల్ఫిన్ క‌ళేబ‌రం

చెన్నై: త‌మిళ‌నాడు రాష్ట్రం క‌న్యాకుమారి సమీపంలోని సొత్తవిలై సముద్రతీరానికి శ‌నివారం మ‌ధ్యాహ్నం ఒక డాల్ఫిన్‌ కళేబరం కొట్టుకొచ్చింది. సాధార‌ణంగా క‌న్యాకుమారి సముద్రతీర ప్రాంతంలో డాల్ఫిన్ల సంచారం ఎక్కువ‌గా ఉండ‌దు. ఈ క్ర‌మంలో తీరంలోకి డాల్ఫిన్ క‌ళేబ‌రం కొట్టుకురాబ‌డం చూసిన మ‌త్స్య‌కారులు ఆశ్చ‌ర్య‌పోయారు. వెంట‌నే కోస్ట్‌గార్డ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని డాల్ఫిన్ క‌ళేబ‌రాన్ని పరిశీలించారు. అయితే, డాల్ఫిన్ అరుదైన జంతుజాలం జాబితాలో ఉండ‌టమేగాక‌, సముద్ర జీవుల భద్రత అటవీశాఖ పరిధిలో ఉండటంతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది అట‌వీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అట‌వీశాఖ‌ అధికారులు డాల్ఫిన్‌‌ కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి తీరప్రాంతం సమీపంలోనే ఖననం చేశారు.logo