ముంబై: ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్(Dadar Railway Station)లో మృతదేహం ఉన్న సూట్‌కేసును పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశారు. రైలులో డెడ్‌బాడీ సూట్‌కేసుతో వెళ్తున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇద్దరే ఆ వ్యక్తిని మర్డర్ చేసినట్లు తేలింది. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు.. లగేజీ చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో.. సూట్‌కేసులో డెడ్‌బాడీని పసికట్టారు. దాని గురించి విచారించగా.. ఆ మర్డర్ పైదుని పోలీసు స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. పోలీసులు ప్రకారం.. బాధితుడితో పాటు నిందితులకు ఓ మహిళా ఫ్రెండ్ విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది.
ఇద్దరు అనుమానితులను జై ప్రవీణ్ చావ్డా, శివజీత్ సురేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఆ ఇద్దరు కలిసి అర్షద్ అలీ షేక్‌ను హత్య చేశారు. శాంటాక్రాజ్లో ఆ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి మర్డర్ జరిగింది. ఆ తర్వాత డెడ్‌బాడీని తుటారి ఎక్స్‌ప్రెస్‌లో తీసుకువెళ్లి .. దూరంగా పడివేయాలని భావించారు. ఈ ఘటనలో దాదర్ రైల్వే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. రైల్వే స్టేషన్లోనే ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి తప్పించుకున్నా.. అతన్ని ఆ తర్వాత మరో చోట పట్టుకున్నారు.
బాధితుడితో పాటు ఇద్దరు అనుమానితులు కూడా మూగవారే. వాళ్లు ప్రత్యేక భాష ద్వార మాత్రమే కమ్యూనికేట్ అవుతారు. ఈ నేపథ్యంలో సైన్ లాంగ్వేజ్ నిపుణులను విచారణ కోసం నియమించారు. ఆ తర్వాతే వాళ్లు దేని కోసం మర్డర్ చేసిందో తెలిసింది. ఓ ఫిమేల్ ఫ్రెండ్ విషయంలో ఓ అనుమానితుడు గొడవకు దిగాడు. పార్టీ కోసం బాధితుడిని పిలిచి, అక్కడ గొడవ జరగడంతో మర్డర్ చేసేశారు. డెడ్‌బాడీని ప్లాస్టిక్‌లో చుట్టి, సూట్‌కేసులో ప్యాక్ చేశారు.