బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలో గుంతలు… మోదీ ప్రారంభించిన నాలుగు రోజుల్లో పాడైన రోడ్డు
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో మరో డొల్లతనం బయటపడింది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలో పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. బుధవారం కురిసిన వర్షానికి ఆ రహదారి పలు చోట్ల దెబ్బతిన్నది. సేలంపూర్ సమీపంలోని చిరియాలో ఎక్స్పెస్వేపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బుధవారం రాత్రి రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యాయి. అజిత్మల్ వద్ద కూడా రోడ్డు పాడైంది. ఈ నేపథ్యంలో మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా భరత్‌కూప్, ఉత్తర ప్రదేశ్ ఇటావాలోని కుద్రేల్ను కలుపుతూ 296 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలు, ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా ఇది వెళుతుంది. ఈ ప్రాజెక్టును 8 వేల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆరు లైన్ల మేర విస్తరించేందుకు వీలుగా పనులు చేపట్టారు. అయితే ప్రధాని మోదీ ప్రారంభించి నాలుగు రోజులు కూడా కాకుండానే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలో పలు చోట్ల రహదారి దెబ్బతినడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
https://twitter.com/Saurabh_Unmute/status/1550075915107184646?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1550075915107184646%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fdays-after-inauguration-by-pm-parts-of-up-expressway-damaged-after-rain-3180695
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

